టీజీఈజెఎసి ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన

TEJA NEWS

టీజీఈజెఎసి ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన

  • ప్రధాన డిమాండ్ల సాధనకై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు తరలిరావాలి
  • టీజీఈ జెఎసి జిల్లా చైర్మన్ ఎస్.కె జాని మియా, అడిషనల్ సెక్రటరీ జనరల్ తంగేళ్ల జితేందర్ రెడ్డి

….

సూర్యపేట జిల్లా : ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొనే ప్రధాన డిమాండ్ల పరిష్కారానికై టీజీఇ జెఎసి సూర్యాపేట జిల్లా ఆధ్వర్యంలో నేడు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరై విజయవంత చేయాలని టిజిఈ జేఏసీ సూర్యాపేట జిల్లా చైర్మన్ ఎస్ కే జానీమియా, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ తంగేళ్ల జితేందర్ రెడ్డి లు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో నిరసన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయుల రెండవ పిఆర్సి 51 శాతం ఫిట్మెంట్ తో వెంటనే అమలు చేయాలని, జూన్ 2 లోపు నివేదిక తెప్పించాలన్నారు.

పెండింగ్ బిల్లులు 13వేల కోట్ల బకాయిలు ఏక మొత్తంగా విడుదల చేసే పెన్షనర్ల ఇబ్బందులు తొలగించడంతో పాటు ఆరోగ్య కార్డులు అమలు చేయాలన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, 1.9.2004 ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వారికి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవే కాకుండా మరో 64 పెండింగ్ అంశాల పరిష్కారానికి నేడు మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు కార్మికులు పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిజీఈ జేఏసీ కో చైర్మన్లు ఎన్ .సోమయ్య, పుప్పాల వీరన్న, పబ్బతి వెంకటేశ్వర్లు, గెజిటెడ్ అధికారుల సంఘం సెక్రటరీ పాండు నాయక్, రవికుమార్, కో చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, దండ శ్యాంసుందర్ రెడ్డి, భూపతి వెంకన్న, డిప్యూటీ సెక్రటరీ దున్న శ్యామ్, లక్కపాక ప్రవీణ్, డాక్టర్ బట్టు గోపి, కోశాధికారి ఆకాష్ వర్మ, గెజిటెడ్ లెక్చరర్ల సంఘం కార్యదర్శి కృష్ణ, ఎం సైదులు, పోతురాజు నరసయ్య, తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top