స్వాతంత్ర ఉద్యమంలో, ఈ దేశ నిర్మాణంలో మౌలానా అబ్దుల్ కలాం అజాద్ పాత్ర అజరామం చైర్మన్ షేక్ రఫాని
మున్సిపల్ కార్యాలయంలో ఘనంగాతొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం అజాద్ జయంతి వేడుకలు
చిలకలూరిపేట : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధులు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం అజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పాల్గొని అధికారులతో కలసి కలాం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశానికి ఆయన చేసిన సేవలను , స్వాతంత్రం సాధించిన అనంతరం ఈ దేశ నిర్మాణం లో వారి ప్రతిభ పాటవాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ.షేక్ అబ్దుల్ రహీం.మేనేజర్ మొహిద్దిన్ , రాజేంద్ర.సానిటరీ ఇనస్పెక్టర్ సి హెచ్ రమణ రావు. మెప్మ సి వో లు,తదితర సిబ్బంది పాల్గొన్నారు.
