అన్ని దానాలు కన్న అన్నదానం మిన్న…. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష
ప్రజలందరికీ ఈశ్వర అనుగ్రహం కలగాలని తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష అన్నారు…
తిరుపతి ఆర్ సి రోడ్డు , రైతు బజార్ ప్రక్క వీధిలో వేలసి ఉన్న.. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా
జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని
మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఆలయ నిర్వాహకులు పి.కుమారి,
మేయర్ కు స్వాగతం పలికి, స్వామి వారి ప్రసాదం అందజేశారు.
అనంతరం మేయర్ చేతులు మీదుగా అన్నదానం జరిగింది.
