అలుపెరుగని రాజకీయ పోరాట యోధుడు.
మేకల నాగిరెడ్డి.
అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో
రైతుల కోసం రైతు పక్షాన, నిరంతరం పోరాటం జరిపిన, జరుపుతున్న,
నాయకుడుగా ప్రజలతో మన్ననలు అందుకున్న మేకల నాగిరెడ్డి.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 12వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తూ, తన సతీమణి అనితను 13వ వార్డ్ అభ్యర్థిగా పోటీలో నిలిపి
ప్రజాసేవకు అంకితం అయ్యారు.
1995లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలుగా సేవలందించి, అందరిచే మన్న నలను పొందారు.
గద్వాల్ ఎమ్మెల్యేలు గా డీకే సమరసింహారెడ్డి, డీకే భర సింహారెడ్డి, వీరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి విశేషమైన సేవలు అందించారు.
నిరంతరం రైతు సమస్యలపై, ప్రభుత్వాలతో మాట్లాడి, సమస్యలను పరిష్కరిస్తూ రైతుల కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు.
1997వ సంవత్సరం సంఘాన్ని స్థాపించి రిజిస్ట్రేషన్ చేసి రైతు నాయకుడిగా సేవలు అందించారు.
రాజకీయ నాయకులతో అనుబంధం కొనసాగిస్తూ రైతు సమస్యలు పరిష్కరిస్తూ విజయం సాధించారు. అనంతరం 2014వ సంవత్సరం టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతూ, ఉత్తనూర్ తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల కోసం, రైతు సమస్యలు పరిష్కరిస్తూ తన సేవలను అందించారు. అనంతరం గత సంవత్సరం కాలంగా తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
నిరంతరం రైతు సమస్యలపై పోరాటం నిర్వహించి, సమస్య లను పరిష్కరిస్తూ, రైతులందరికీ నేనున్నానని ధైర్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునిసిపల్ ఎన్నికల సందర్భంగా తనకు అత్యంత ప్రజాదరణ ఉందని, ప్రజల మద్దతు మరువలేనిదని, 12వ వార్డు నుంచి తన భార్య అనిత , 13వ వార్డు నుండి ఇద్దరు విజయం సాధించి, ఐజ మున్సిపాలిటీకి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సారిద్యంలో అభివృద్ధి పరచాలని, రాష్ట్రంలో అత్యున్నత మున్సిపాలిటీలో ఐజ మునిసిపాలిటీని తీర్చిదిద్దాలని తన సంకల్పంగా ఉందని,ఈ సందర్భంగా మేకల నాగిరెడ్డి తెలిపారు.
