జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

TEJA NEWS

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ ని భారీ మెజారిటీతో గెలుపించేందుకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గోన్నారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతున్న ప్రజా పాలన విధానాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అనునిత్యం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయి అని మండిపడ్డారు..

జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై అసత్యలను అంటకట్టి గెలువాలని చూడటం వారి భ్రమ మాత్రమే అన్నారు.. చిన్న శ్రీశైలం యాదవ్ తో సహాయం కోరిన వారే అసత్యాన్ని ప్రచురించడం చాలా బాధాకరం అన్నారు..

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.నవీన్ యాదవ్ గెలుపై నియోజకవర్గం ప్రజలు గట్టి నమ్మకంతో ఉన్నారని తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top