శ్రీరామ్ వారి వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర, దారపనేని

TEJA NEWS

శ్రీరామ్ వారి వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర, దారపనేని

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం పామూరు పట్టణ ప్రముఖ రియల్టర్ , సీఎస్ పురం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీరామ్ శ్రీనివాసులు సోదరులు శ్రీరామ్ వెంకట్రావు శ్రీమతి ప్రమీల దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి నవీన్, గుంటూరు జిల్లా వాస్తవ్యులు అడపాల శ్రీనివాసరావు శ్రీమతి ప్రసన్న రాణి దంపతుల కుమార్తె నాగజ్యోతిల వివాహ వేడుకలు బుధవారం పామూరు పట్టణంలోని పువ్వాడి రాధాకృష్ణ కన్వెన్షన్ హాలులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. పామూరు మాజీ సర్పంచ్ కావిటి వెంకటసుబ్బయ్య, తూర్పు కట్టకిందపల్లి మాజీ సర్పంచ్ , నీటి సంఘం చైర్మన్ గురు స్వామి, ఉప్పు గళ్ళ సురేష్, నుచ్చు పొద టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరెకొండ హరిప్రసాద్, మోపాడు టిడిపి నాయకులు యర సింగ్ రాయుడు శ్రీరామ్ వారి కుటుంబ సభ్యులు, అడపాల వారి కుటుంబ సభ్యులు వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top