హరితహారం వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రం మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హరితహారం వనమహోత్సవ కార్యక్రమం ఓ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు అటవీశాఖ పోలీస్ శాఖలతో పాటు పలు శాఖల అధికారులు కార్యక్రమంలో భాగమయ్యారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో స్థానిక ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించి మొక్కల పెంపకం ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ గ్రీన్ ఇండియా కలను నెరవేర్చే దిశగా ముందడుగు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులకు ప్రోత్సాహం కలిగించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన హరితహారం పై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్క నాటి దానికి సంరక్షణ బాధ్యత తీసుకుంటే భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించగలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సృజనాత్మక ప్లకార్డులు బాటిల్ గార్డెనింగ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎఫ్ఓ కే.దామోదర్ రెడ్డి,
అశ్వారావుపేట,దమ్మపేట ఎఫ్ఆర్ఓ లు మురళీ,శ్రీనివాసరావు,రెండు మండలాల క్షేత్రస్థాయి సిబ్బంది తహశీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ,మండల పరిషత్ ప్రత్యేక అధికారి పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ప్రదీప్,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు , ఎంఈఓ పొన్నగంటి ప్రసాదరావు ,ప్రధానోపాధ్యాయులు పి.హరిత,ఎన్.కొండలరావు ,భావ్ సింగ్,టి.సంగీత,
సీఐ నాగరాజు రెడ్డి,అదనపు ఎస్ఐ వీ.రామ్మూర్తి,
ప్రభుత్వ జూనియర్ కళాశాల ముస్లిం మైనార్టీ గురుకులం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లు అల్లు అనిత,తూము సంగీత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
