పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే జారే

TEJA NEWS

పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే జారే


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గండుగులపల్లిలో నిర్వహించిన వనమహోత్సవంలో పాల్గొన్నారు. అశ్వారావుపేట ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ప్రతి ఇంటి ముందు ఒక్క మొక్క నాటి సంరక్షించి పెద్ద చెట్టుగా పెంచితే పచ్చదనం పెరుగుతుందన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలన్నారు. భవిష్యత్ తరాలకు శుభ్రమైన వాతావరణం అందించాలిని వాతావరణ మార్పులు ఎదుర్కొనాలంటే ప్రకృతిని సంరక్షించాల్సిన అవసరం మనందరి మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అటవీ శాఖ మరియు వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    You cannot copy content of this page

    Scroll to Top