మనుపాటి హర్షణ్ రెడ్డి తొలి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు

TEJA NEWS

మనుపాటి హర్షణ్ రెడ్డి తొలి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు …

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు మనుపాటి ఏలేంద్ర మనువడు మనుపాటిహర్షణ్ రెడ్డి తొలి జన్మదిన వేడుకల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్. నాగరాజు పాల్గొని చిన్నారి చిరంజీవిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారికి ఆయురారోగ్యాలు, విద్యాబుద్ధులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు…

అనంతరం వేద న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఎమ్మెల్యే నాగరాజు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ ఆవిష్కరించారు..

తదనంతరం మార్గమధ్యంలో యువకులు క్రికెట్ ఆడుతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే నాగరాజు వారి వద్దకు వెళ్లి యువతతో మమేకమై మాట్లాడుతూ, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మైదానాల వైపు అడుగులు వేయాలని సూచించారు. క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు…

ఈ సందర్భంగా స్వయంగా బౌలింగ్ చేస్తూ, బ్యాట్ పట్టి యువ క్రీడాకారులను ఉత్తేజపరిచి వారిలో మరింత ఉత్సాహం నింపారు…

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్, కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య, డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్, డివిజన్ మహిళ అధ్యక్షురాలు శ్రీమతి షేక్ సైజాజి, నాయకులు అడుప మహేష్, చిలువేరు శ్రీనివాస్, పస్తం శంకర్, గ్రామ పార్టీ అధ్యక్షులు కడెం కుమార్, సౌరం చిన్ని, గొలుసుల సంతోష్, వరంగల్ భాష, మచ్చర్ల స్టాలిన్, మహేష్, నర్సింగోజు నరేందర చారి, దామెర ఆనంద్ యూత్ నాయకులు రాజేష్, సుధీర్, భరత్, ప్రశాంత్, తో పాటు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top