గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటిన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్.

TEJA NEWS

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్ర మహిళా శక్తి క్యాంటిన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్….

పెద్దపల్లి // రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోగులు, వారి బంధువులకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఇంద్ర మహిళా శక్తి క్యాంటిన్ ను ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ఆసుపత్రికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు పరిశుభ్రమైన, తక్కువ ధరలో భోజనం అందించేందుకు ఈ క్యాంటిన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళా సంఘాల ద్వారా నిర్వహించబడే ఈ క్యాంటిన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top