చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమీక్ష
చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ, చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నామని, పేదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు మారిపోవాలని వైద్యులకు సూచించారు. అడ్వైజరీ కమిటీ సభ్యులు వైద్యశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు.
