రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
బాధితులకు ప్రభుత్వ సహాయం అందే విధంగా చూస్తామని హామీ
వనపర్తి
గురువారం రాత్రి రేవల్లి మండలం కొంకలపల్లి గ్రామానికి చెందిన ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెంది మరో 8 మందికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది
విషయం తెలుసుకునీ శుక్రవారం వనపర్తి శాసనసభ్యులు హైదరాబాద్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకుని ప్రమాద బాధితులను ఆయన పరామర్శించారు
ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు… కొంకలపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కురుమూర్తి తన కుటుంబ సభ్యులుతో జనుంపల్లిలోని మంత్రాలమ్మ అమ్మవారికి పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో
జనుంపల్లి కొంకలపల్లి మధ్యన గల ఏదుల టర్నింగ్ లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి ఆటోను ఢీ కొట్టింది
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి మృతి చెందిన వారిలో వెంకటస్వామి, సుమిత్ర ఉన్నారని వారు తెలిపారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మృతదేహాలను చూసిన అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సైతం పరామర్శించు నాణ్యమైన వైద్యం అందించాలని ఆసుపత్రి వర్గాలకు సూచించారు
మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వపరమైన ఆర్థిక సహాయం అదేవిధంగా చూస్తామని ఆయన తెలిపారు
కార్యక్రమంలో రేవల్లి మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
