రంజాన్ కి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న .. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

TEJA NEWS

రంజాన్ కి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న .. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు సంతపేట ఈద్గాలో.. రంజాన్ పండుగను పురస్కరించుకుని … ముస్లిం మైనార్టీ సోదరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈదుల్ ఫితర్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మైనార్టీ సోదరులను కలుసుకొని వారిని ఆప్యాయంగా పలకరించి.వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంతపేట ఈద్గా వద్ద.ముస్లిం సోదరులతో కలిసి.రంజాన్ ప్రార్థనలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.సర్వ మానవాళి శ్రేయస్సు కోరుతూ సమాజహితం కోరుతూ రంజాన్ మాసంలోముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అల్లాకు ప్రార్థనలు చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి,వైసిపి మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్, నగర ఉపాధ్యక్షులు షఫీ, 49వ డివిజన్ నేతలు షబ్బీర్, రియాజ్, 52 డివిజన్ ఇన్ చార్జ్ మహబూబ్ బాషా,నగర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top