కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూడలేకే అక్రమ కేసులకు పాల్పడుతున్న మోడీ

TEJA NEWS

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూడలేకే అక్రమ కేసులకు పాల్పడుతున్న మోడీ

_ పార్టీ పిలుపుమేరకు ధర్నాలో పాల్గొ న్న ఎమ్మెల్యే మేఘారెడ్డి_

వనపర్తి

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేని మోడీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పేర్లు నమోదు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పాల్గొని మాట్లాడారు

ప్రతిపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని కూడగట్టుకొని వెంటిలేషన్ పై సర్కారును కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వానికి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు

కాంగ్రెస్ పార్టీ పై కక్ష దింపు చర్యలు ఇలాగే కొనసాగిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా dccb అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఖిల్లా ఘణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top