
గోదావరిఖనిలో ఎంపీ వంశీకృష్ణ – మంత్రి వివేక్ పర్యటన…
వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పర్యటించారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాచకొండ శ్యామల – కోటేశ్వర్ దంపతుల కుమార్తె వివాహ వేడుకకు హాజరైన వారు నూతన వధూవరులు అక్షయ–శశిధర్‌లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ కి, మంత్రి వివేక్ వెంకటస్వామి కి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకుల రాకతో వివాహ వేడుక ప్రాంగణంలో సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా, గుమ్మడి కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.