భక్తిశ్రద్దలతో నాగులచవితి పూజలు

TEJA NEWS

భక్తిశ్రద్దలతో నాగులచవితి పూజలు

తిరుపతి: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలం కళాకారులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిర ప్రాంగణంలో ఉన్న నాగుల పుట్టకు పాలు పోసి సాంప్రదాయరీతిలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుండాల గోపినాధ్ రెడ్డి నాగుల చవితి విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ పర్వదినం సర్పదేవత పూజకు, ప్రకృతి సమతుల్యతకు, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతీకగా భావిస్తారని తెలిపారు. సర్పాలు వ్యవసాయానికి మిత్రులని, వాటి రక్షణ మన పర్యావరణ పరిరక్షణలో భాగమని వివరించారు. మన పురాణ ఇతిహాసాలలో కూడా పాములకు విశిష్టత స్థానం ఉందని పేర్కొన్నారు. నాగుల చవితి రోజున పాముకు పాలు పోసి పూజించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం ప్రతినిధులు టీచర్ తిరుమలయ్య, తిరుపతి ఆది గురుస్వామి, పురోహితుడు సురేష్ స్వామి, చిత్తరపు హనుమంతరావు, కృష్ణమూర్తి రెడ్డి, మునియప్ప గారి మునినాధ రెడ్డి, తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, అన్నా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కళ్యాణి, భాగ్యలక్ష్మి, పార్వతి, ధనమ్మ, యశోద, తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top