కొత్త సంవత్సరం అందరి జీవితంలో వెలుగులు రావాలి

TEJA NEWS

కొత్త సంవత్సరం అందరి జీవితంలో వెలుగులు రావాలి
గాంధీకలలగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా నూతన సర్పంచులు కృషి చేయాలి…………. సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పులస శంకర్ గౌడ్

వనపర్తి
2026 సంవత్సరంలో ప్రజలందరి జీవితంలో వెలుగులు రావాలని,మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్‌గౌడ్‌ కోరారు .కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని ఆకాంక్షించారు ,*ప్రజలందరు మంచి జరుగుతుందని ఆశతో జీవించాలని,అందరు బాగుండాలి అందులో మనము ఉండాలనీ కోరుకుందాం అన్నారు

నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని అన్నారు.నూతనంగా ఎన్నిక అయిన సర్పంచులు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్జం కోసం ఉన్నత లక్ష్యం తో ముందుకు సాగాలని*ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. నాయకులకు,మేధావులకు, కవులు, కళాకారులు, ఉపాధ్యాయులకు. ,విద్యార్థులకు,ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు

You cannot copy content of this page

Scroll to Top