ఎడ్లపాడు మండలంలో పటిష్ట బందోబస్తుతో నూతన సంవత్సరం వేడుకలకు పోలీసులు సిద్ధం..
మండల ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్సై టి శివరామకృష్ణ.
ఎడ్లపాడు మండల ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ,ఈ రాత్రి అర్థరాత్రి జరిగే నూతన సంవత్సరం వేడుకలను ప్రజలు శాంతియుతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని ఎడ్లపాడుపోలీసులు విజ్ఞప్తిచేశారు.నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు.ముఖ్య కూడళ్లలో, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, దేవాలయాలు, హోటళ్లు, ప్రధాన రహదారుల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయగా, నైట్ ప్యాట్రోలింగ్ను మరింత కఠినతరం చేసినట్లు ఆయన చెప్పారు.
ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలను పోలీసులు విడుదల చేశారు.మద్యం సేవించి వాహనాలు నడిపితేచట్టపరమైన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించాలన్నారు. అలాగే అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, స్టంట్లు చేయడం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టంచేశారు.మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, ఎవరైనా అసభ్య ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుహెచ్చరించారు.
ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శబ్ద కాలుష్యం, గొడవలు, రోడ్లపై గుమిగూడటం, ట్రాఫిక్కు ఆటంకం కలిగించడం వంటి చర్యలుఅనుమతించబడవని తెలిపారు.యువత తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా విజ్ఞప్తిచేశారు.ఏవైనా అనుమానాస్పద లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే ఎడ్లపాడు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. “ప్రజల సహకారమే శాంతియుత నూతన సంవత్సరం వేడుకలకు కీలకం” అని ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు.
