50వ డివిజన్ లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్

TEJA NEWS

50వ డివిజన్ లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించిన ధూళికట్ట సతీష్ …

సాక్షిత పెద్దపల్లి //గోదావరిఖని రామగుండం ఎమ్మెల్యే
రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, నగర మేయర్ మహంకాళి స్వామి సూచనలతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 50వ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను శనివారం పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న సూపర్వైజర్లకు, కార్మికులకు పనులను నాణ్యతగా, వేగంగా పూర్తి చేసి త్వరితగతిన వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించడం జరిగింది.

ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ నాయకత్వంలో రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న నగర సుందరీకరణ పనులు, నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడటమే కాకుండా స్థానిక వ్యాపారస్తులకు అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని తెలిపారు.

అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా ముందుకు సాగుతున్నారు.

You cannot copy content of this page

Scroll to Top