ఇకపై నెలలో 15 రోజులపాటు… రోజు రెండు పూటల… చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్

TEJA NEWS

ఇకపై నెలలో 15 రోజులపాటు… రోజు రెండు పూటల… చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ

పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి, ఇంటింటికి ఇవ్వడం మానేసి నెలలో 1-2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతోమంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులుపడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు, ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు.. ఉదయం 8 గం.ల నుంచి 12 గం.ల వరకు అలాగే సాయంత్రం 4గం. ల నుండి 8 గం.ల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందించనున్నాము. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రతీ ఒక్క కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంది

You cannot copy content of this page

Scroll to Top