TEJA NEWS

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.

నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.స్వీయ పర్యవేక్షణలో భవానీ దీక్షా విరమణ బంధోబస్త్

సాంకేతికతనే ఆయుధంగా చేసుకుని పర్యవేక్షిస్తున్న నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్..

ఫేసియల్ రికగ్నైజెషన్ కెమెరాల ద్వారా పాత నేరస్థుల కదలికలపై నిఘా

ఏ.ఐ.డ్రోన్ మరియు సి.సి.కెమెరాల ద్వారా భవానిల రద్దీ పరిశీలన

భవాని దీక్షల విరమణ కార్యక్రమ నేపథ్యంలో పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతికతను ఆయుధంగా చేసుకుని పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి భవానీ దీక్షా విరమణ బందోబస్త్ ను మోడల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నుండి సి.సి.కెమెరాల ద్వారా స్నాన ఘాట్ లను, క్యూలైన్స్, పార్కింగ్ ప్రదేశాలను, కేశఖండన శాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించి బందోబస్త్ సిబ్బందికి తగు సూచనలు చేశారు.

ట్రాఫిక్ పరంగా అస్త్రం యాప్ ద్వారా రద్దీని పర్యవేక్షిస్తూ భవానీలు వారి వాహనాలను నిర్ణిత ప్రదేశాలాలో పార్కింగ్ చేసుకునే విధంగా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు.

అదేవిధంగా మూడో రోజు కూడా ఏ.ఐ. డ్రో న్ కెమెరాల ద్వారా గిరిప్రదక్షణ ఏరియాలలొని రద్దీని పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఫేసియల్ రికగ్నైజెషన్ కెమెరాల ద్వారా టెంపుల్ పరిసర ప్రాంతాలలో పాత నేరస్థుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి పాత నేరస్థులను గుర్తించిన వెంటనే కంట్రోల్ రూం నుండి ఆ ఏరియాలోని క్రైమ్ సిబ్బందికి ఫోటోలను పంపి సదరు వ్యక్తులను అదుపులోనికి విచారించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.

అనంతరం కంట్రోల్ రూం నుండే హోమగుండాలను, విరుముడి స్టాల్స్ మరియు ప్రసాదం కౌంటర్లను పరిశీలిస్తూ అధికారులను మరియు సిబ్బందిని తగు సూచనలిస్తూ అప్రమత్తం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్.,, డి.సి.పి.లు శ్రీమతి షిరీన్ బేగం ఐ.పి.ఎస్.గారు, ఇన్ ఛార్జ్ కలెక్టర్ ఇలాక్కియా ఐ.ఏ.ఎస్., క్రైమ్ ఏ.డి.సి.పి. ఎం రాజారావు , ఇతర అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ.లు, సిబ్బంది పాల్గొన్నారు.