ఆదరణకు ఓర్వలేకే జగన్ నిత్యం డ్రామాలు

TEJA NEWS

ఆదరణకు ఓర్వలేకే జగన్ నిత్యం డ్రామాలు

** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్

చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను ఏడాదిలోనే పూర్తిచేసి అన్నివర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ రావడాన్ని చూసి ఓర్వలేకే వైకాపా పార్టీ జగన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ నిత్యం డ్రామాలు వేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకీటీల సురేంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయం లో ఆఫీస్ సెక్రటరీ మోహన్ రాజ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. వెంకిటీల సురేంద్ర మాట్లాడుతూ వైసీపీ నాయకులు కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే కూటమి ప్రభుత్వముపై దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. అసలు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం అంటే జగన్ రెడ్డికి గానీ, వైసీపీ లోని ఆయన కోటరీకి గానీ అర్థం తెలుసా..? అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో 85 శాతం హామీలను ఉల్లంఘించిన జగన్…. ఇప్పుడు రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ప్రోగ్రాంకు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. వైకాపా నాయకులు ఆ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణలు అంటూ కరపత్రాలతో ఫోటోలకు దిగి కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
2019 ఎన్నికల మునుపు వైకాపా అధినేత జగన్ రెడ్డి 730 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 151 సీట్లతో 5 ఏళ్ళు అధికారంలో ఉండినా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన ఘనుడు జగన్ అన్నారు. 1000 రూపాయల పెన్షన్ పెంపును అమలు చేయడానికి ఏళ్ళు సమయం తీసుకున్నా…ఇప్పుడేమో నీతి వాక్యాలు వల్లిస్తున్నాడని దుయ్యబట్టారు. అలాంటి చరిత్ర వైకాపా ది , జగన్మోహన్ రెడ్డి ది అన్నారు.


చంద్రబాబు మేనిఫెస్టో ను గురించి , సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి మాటలాడటం , రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ప్రచారాలకు దిగడం సిగ్గుచేటుగా ఉండదా అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 700 పైగా మంచి పనులు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఒకేసారి పెన్షన్లను 1000 రూపాయలు పెంచి 3 వేల పెన్షన్ 4 వేలు చేసి పంపిణీ చేసామన్నారు. మహిళలకు ఏడాది కి మూడు ఉచిత సీలిండర్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం అమలుచేశామని తెలిపారు. ఆగష్టు 15 నుండి ఇతర రాష్ట్రాలలో కంటే మెరుగ్గా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేయనున్నామని వెల్లడించారు. పేదలు, కార్మికుల ఆకలి తీర్చే అన్న కాంటీన్లను వైకాపా పాలనలో మూసివేస్తే 207 అన్న కాంటీన్లను తిరిగి ప్రారంభించాం అన్నారు.
ముఖ్యంగా వైకాపా పాలనలో రోడ్లలో పడిన గుంతలను పూడ్చామని చెప్పారు. గ్రామాల్లో తిరిగి సిమెంట్ రోడ్లు వేసామని,
వీటిని ప్రజల మధ్యకు వెళ్లి ప్రజలను కలిసి అడిగితే , చెవులతో విని…. కళ్ళతో చూస్తే కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు , పనులు గురించి వైకాపా నాయకులకు తెలుస్తాయని వెంకిటీల హితవు పలికారు. నాలుగు గోడల మధ్య కూర్చొని అసత్య ప్రచారాలు చేస్తుంటే ప్రజలు హర్శించరు. మీరే అభాసుపాలవుతారనే విషయం వైకాపా నాయకులు గ్రహించాలన్నారు. కూటమి ప్రభుత్వంకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే నిత్యం ఏదో ఒక రూపం లో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు వైకాపా నాయకులని తీవ్రంగా ఆక్షేపించారు.

You cannot copy content of this page

Scroll to Top