అభివృద్ధే మా లక్ష్యం దమ్మపేట మండలంలో రూ. 3.44 కోట్ల పనులకు శుభారంభం చేసిన ఎమ్మెల్యే జారె
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దమ్మపేట మండలంలో పలు గ్రామాల్లో పూర్తి అయిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రజలకు అంకితం చేశారు. మొత్తం రూ. 3 కోట్లు 44 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మితమైన సీసీ రోడ్లు పాఠశాలల ప్రహరీ గోడలు త్రాగునీటి కోసం నూతన బోరు మోటార్లు పైప్ లైన్లు హ్యాండ్ పంపులు తదితర పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లబ్ధిదారులకు మంజూరైన చెక్కులు అందించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రాథమిక సౌకర్యాలు ప్రజల ఇంటి ముంగిటికి చేర్చడానికి విశేషంగా కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. రోబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలకు మంచి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. పర్యటనలో భాగంగా మార్గం మధ్యలో వరి నాట్లు వేస్తున్న కూలీలను చూసి ఆగారు వారితో కలిసి వరి నాట్లు వేసి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు.
