ప్రతినెలా ఒకటో తేదీన రాష్ట్రంలో పింఛన్ల పండుగ

TEJA NEWS

ప్రతినెలా ఒకటో తేదీన రాష్ట్రంలో పింఛన్ల పండుగ

నెల్లూరు రాపూర్

రాపూరు ప్రతినెలా ఒకటో తేదీన రాష్ట్రంలో పింఛన్ల పండుగరోజు అని, పింఛన్ల పంపిణీతో సీఎం చంద్రబాబు సృష్టించారన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పచ్చిగళ్ళ రత్నయ్య అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని అరుంధతి వాడలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందించి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు.

ఈ సందర్భంగా పచ్చిగళ్ళ రత్నయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక గత 17 నెలల్లో కేవలం సామాజిక పింఛన్లకే రూ.50,763 కోట్లు ఖర్చు చేసింది అన్ని ఆయన తెలిపారు. ప్రతి నెల ఒకటో తారీఖున రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ పండుగ రోజుగా అభివర్ణించారు. వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, మంచానికి పరిమితమైన వికలాంగులకు రూ.15వేలు అందిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల కళ్ళల ఆనందం చూస్తే సంతోషంగా ఉందని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో అంగనవాడి టీచర్ ప్రమీల, తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top