వనపర్తి లో కరెంటు కోతల తో తీవ్రనీటి సమస్య అవస్థల్లో ప్రజలు

TEJA NEWS

వనపర్తి లో కరెంటు కోతల తో తీవ్రనీటి సమస్య అవస్థల్లో ప్రజలు

నూతన కౌన్సిలర్లు వార్డు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. …… తెలంగాణ జన సమితి జిల్లాఅధ్యక్షుడు ఖాదర్ పాషా

కోట్లు వెచ్చించి నిర్మించిన టౌనాలను వినియోగంలోకి తీసుకురావాలని నాయకులకు విజ్ఞప్తి

వనపర్తి :

వనపర్తి జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల నుంచి అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల జిల్లా కేంద్రంలో అనేక వార్డుల్లో కరెంటు సరఫరా లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని మరోపక్క ప్రజలకు నీటి సరఫరా లో కూడా ఇబ్బందులు ఏర్పడుతుందని తెలంగాణ జన సమితి వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎం ఏ ఖాదర్ పాష ఆవేదన వ్యక్తం చేశారు. ముందే వేసవికాలం మరోపక్క రోహిణి కార్తి లో ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలకు త్రాగునీటి సరఫరాతో పాటు విద్యుత్ సరఫరా లో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. బాధ్యతగల సంబంధిత మిషన్ భగీరథ అధికారులు మున్సిపల్ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వార్డు కౌన్సిలర్లు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కొంతమంది వార్డు సమస్యలను పట్టించుకోకుండా వార్డులో పర్యటించకుండా ఎన్నికల ముందు కనిపించిన నాయకులు తర్వాత అడ్రస్ లేకుండా పోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక వనపర్తి పట్టణ మున్సిపాలిటీలోని 21వ వార్డు మారెమ్మ కుంట తో పాటు 22వ వార్డు శ్వేతా నగర్ గణేష్ నగర్ 11వ వార్డు రాంనగర్ కాలనీలో అడ్డగోలుగా కరెంటు పోతాను ఉన్నాయని ఎప్పుడూ కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో అంతు చిక్కడం లేదని ప్రజలు ఎండకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని రాత్రి వేళలో నిద్ర పట్టకుండా జనం బయటకు వచ్చి అర్ధరాత్రి వేళలో కాలం గడుపుకుంతు న్నారని అన్నారు.

అదేవిధంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డ్ లో నిర్మించిన టౌన్ హాల్ వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రయోజనం లేదని అన్నారు. జిల్లా కేంద్రంలో నడి ఒడ్డున ఎంతో చూడముచ్చటగా టౌన్ హాల్ నిర్మాణం చేసినప్పటికీ ప్రభుత్వాలు మారిన పాలకులు మారినా టౌన్ హాల్ ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుందని ఖాదర్ పాష ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డి తో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల్ల చిన్నారెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి స్పందించి నిరుపయోగంగా పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయించి టౌన్ హాల్ వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదేవిధంగా నిర్లక్ష్యం వహిస్తే టౌన్ హాల్ శిథిలావస్థకు చేరుకుంటుందని వెంటనే మార్కెటింగ్ శాఖ మున్సిపల్ శాఖ అధికారుల సమన్వయంతో అడ్డంకులను తొలగించాలని ప్రజల ఆస్తిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఖాదర్ పాష డిమాండ్ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top