బుచ్చి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మోర్ల సుప్రజా

TEJA NEWS

బుచ్చి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మోర్ల సుప్రజా

బుచ్చిభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా సూచించారు.. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ,మున్సిపల్ అధికారులతో ,కలిసి గుడిపల్లి కాలువను పర్యవేక్షించడం జరిగింది.. కాలువలో ఉండే చెత్తను జెసిబి ద్వారా తొలగించమని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.. మలిదేవి కాలువ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫైర్ స్టేషన్ శంకుస్థాపన నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించడం జరిగింది.. అనంతరం మంగలి కట్ట జగనన్న కాలనీలో త్రాగునీటి ఇబ్బందులు ఉన్నాయని అక్కడి ప్రజలు తెలియజేయగా, వారికి వాటర్ ట్యాంక్ ద్వారా త్రాగునీటి సరఫరా చేయాలని సుప్రజా ఆదేశించారు… తీవ్రమైన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, శానిటేషన్ సిబ్బంది, వాటర్ సిబ్బంది, కరెంటు సిబ్బంది, అందరు కూడా అందుబాటులో ఉండాలని చైర్ పర్సన్ ఆదేశించారు.. వర్షాలు ఎక్కువగా కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, అందరు కూడా ఇంటి వద్దనే ఉండాలన్నారు.. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని చైర్ పర్సన్ తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తో పాటు, వైస్ చైర్మన్ ఎరుటపల్లి శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్ రహమత్ భాషా , ఏఈ పూజిత, వెంకటేష్, శానిటేషన్, కరెంట్, వాటర్ ,డిపార్ట్మెంట్ మేస్త్రిలు, పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top