నో టు డ్రగ్స్” వాక్‌థాన్ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్

TEJA NEWS

“నో టు డ్రగ్స్” వాక్‌థాన్ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. గారు

ఈగల్ టీం మరియు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీ

బందర్ రోడ్డు ఇంధిరాగాంధి మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సాగిన “నో టు డ్రగ్స్” వాక్‌థాన్

నగర పోలీసు కమిషనర్ మాట్లాడుతూ…… గత సంవత్సరం నుంచి డ్రగ్స్ మీద తిరుగుబాటు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈగల్ టీం ని ప్రవేశపెట్టడం జరిగింది.

ఎన్.టి.ఆర్.పోలీసు కమిషనర్ రేట్ పరిధిలో మొత్తం మీద 22 మందిపై PIT NDPS యాక్ట్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది.

ఎవరైనా గంజాయి తీసుకున్నా, అమ్మినా వాళ్ళని జైళ్లకు పంపిస్తాం, NDPS యాక్ట్ చాలా డేంజర్ ఒక్కసారి చిక్కుకుంటే లైఫ్ లాంగ్ బయిటికి రాలేరు

సమాజంలో మరింత చైతన్యం కలిపించడానికి డ్రగ్స్ పై దండ యాత్ర అనే నినాధంతో 27వ తేదీన సైకిల్ ర్యాలీ చేపట్టబోతున్నాము.

You cannot copy content of this page

Scroll to Top