రాష్ట్ర వైఎస్సార్ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పోతిరెడ్డి సుబ్బారెడ్డి కి కుమ్మరిపాలెం సెంటర్ లో అభినందన కార్యక్రమం జరిగింది.. కార్యక్రమం నిర్వాహకులు పొదిలి చంటిబాబు మాట్లాడుతూ గత వైఎస్సార్ ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అగ్రబాగంలో నిలిపారు…………………
రెండు సార్లు కరోనా వచ్చి దేశం మొత్తం ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదురైనా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏపీలో ఏ ఒక్కరూ నష్ట పోకుండా అనేక కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శం నిలిచారు. కూటమి నాయకులు సూపర్ సిక్స్ అంటు అబద్ధాలు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేశారు .. తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ డైవర్షన్ కోసం అదికార పార్టీ వాడుకుంటున్నారు పశ్చిమ నియోజక వర్గం 39 వ డివిజన్ కుమ్మరిపాలెం సెంటర్ లో గత నలభై ఏళ్ళ క్రితం నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన ఎడిఎస్ ఎమ్ స్కూల్ శిథిలావస్త చెందండం వల్ల అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చొరవతో మూడు అంతస్తులకోసం ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి పనులు ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు పునాదుల దగ్గరే ఆగిపోయింది.. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ ఎస్ ఈ సి సభ్యులు డి జె పి కెన్నెడీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ హయత్ షరీఫ్. మైనార్టీ జాయింట్ సెక్రటరీ షేక్ బషీర్ అహ్మద్.39 వ డివిజన్ ఇంచార్జీ పరమేశ్ రుద్ర శంకర్ యూ చలపతి. తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియ చేశారు.. ఇట్లు పొదిలి చంటిబాబు అధికార ప్రతినిధి వైఎస్ఆర్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా..
