మేడారం సమ్మక్క – సారాలమ్మ జాతర లో “ప్రభాత భేరి *
మానవ విలువలు చాటుతున్న మంత్రి జూపల్లి*
తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వందలాది మంది కళాకారులు “ప్రభాత భేరి ” మోగించారు, సమాజం లో ప్రభలుతున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలపైన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాయి, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణ రావు ఆదేశాల మేరకు మరియు సంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి సలాహ సూచనలతో సాంసృతిక కార్యక్రమాలతో అలరిస్తూ సామజిక చైతన్యం చేయాలనే లక్ష్యం తో కళాకారుల కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆసియా ఖండం లోనే అతిపెద్ద జాతర అయిన తెలంగాణ సమ్మక్క సారక్క జాతరకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు అని, జాతరలో వచ్చే ప్రజలని చైతన్యం చేయాలనీ నిత్య జీవితం లో ప్రజలు వివిధ రకాలుగా ఎదురుకుంటున్న సమస్యలు,ఆ సమస్యలకు గల కారణాలు కళ రూపాలతో వివరించడం వలన జాతరకు వచ్చిన ప్రజలు ఆసక్తిగా వింటున్నారు,
గంజాయి భారిన పడుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, డ్రగ్స్ మత్తులో మునిగి బంగారం లాంటి భవితను నాశనం చేస్కుంటున్నా యువత గురించి, అనవసర ఆడంబరాలకు పోయి అప్పుల పాలవ్వుతూ కుటుంబాలు ఛిద్రం అవుతున్న తీరును మానవ విలువలు నశించి పోయి మత్తులో వావి వరుసలు మరిచి, క్షనీకానందం కోసం అక్రమ సంబంధాలతో, మానభంగాలు మర్డర్ లు జరగడం పట్ల సమాజం లో ప్రభలుతున్న విష సంస్కృతి ని అరికట్టాలని కళాకారులు కండ్లకు కట్టినట్టు వివిధ కళారూపాల ద్వారా వివరిస్తూ చైతన్యం చేస్తున్నారు.ఒగ్గుకత, హారికత, పల్లె సుద్దులు, నాటికలు, కోలాటం, డప్పు నృత్యాలు, ఒగ్గు డోలు నృత్యాలు,మరియు గాయకుల పాటలతో అనేక సమాజిక చైతన్య గేయాలు మొదలగు కళారుపాలతో కళా జాతర జరుగుతున్న తీరును మేడారం లో సమాజాన్ని చైతన్యం చేసే ప్రక్రియను చూసి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమ్మక్క- సారక్క జాతర లో కళా రూపాల జాతర సాగుతుందని పలువురు విద్యావంతులు అభినందించడం, ప్రజా ప్రభుత్వం లో ప్రజల్ని చైతన్యం చేసే ప్రభాత భేరి ఇలాంటివి మరెన్నో జరగాలని సూచించడం మంచి పరిణామం అని ప్రభాత భేరి ఇంచార్జ్ దరువు అంజన్న, మరియు సలహామండలి సభ్యులు డా. దరువు ఎల్లన్న లు తెలియజేశారు.
