డ్రిప్ ఫ్యాక్టరీ మంటల్లో దగ్ధం కోట్లల్లో ఆస్తి నష్టం.
బాధితుడు ప్రతాపరెడ్డి ఆవేదన.
ఐజ :
ఐజ పట్టణంలో సమీపంలో భూమ్ పురం ప్రతాప్ రెడ్డికి సంబంధించిన పరమేశ్వర డ్రిప్ ఫ్యాక్టరీ పూర్తిగా దగ్ధమవడంతో మూడు కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని, యజమాని ప్రతాప్ రెడ్డి తెలిపారు. సమయానికి అగ్నిమాపకం కేంద్రం ఇక్కడ లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందని, జిల్లా కేంద్రంలో గద్వాల్ 30 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల అక్కడి నుంచి రావడంతో ఆలస్యం అయిందని, అంతలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయవాది మధు మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గత 20 సంవత్సరాలుగా ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా ఇంకా ఏర్పాటు చేయలేదని ఈ సందర్భంగా అన్నారు.
