అకాల వర్షం ఈదురు గాలులకు జరిగిన ఆస్తి నష్టాం

TEJA NEWS

అకాల వర్షం ఈదురు గాలులకు జరిగిన ఆస్తి నష్టాం

సాయంత్రం ఐదు గంటల సమయంలో కురిసిన అకాల వర్షాలకు మరియు ఈదురు గాలులకు చెట్లు విరిగి ఇల్లు పై కప్పుల మీద పడి ఆస్తి నష్టం జరిగింది మరియు కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. ఈ విషయాన్ని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకుని వెళ్ళగా ఆయన వెంటనే స్పందించి ఎమ్మార్వో విజయ శ్రీ ని ఆస్తి నష్టాన్ని పరిశీలించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడంతో మండలంలోని సంఘం గోపాలపురంలో జరిగిన ఆస్తి నష్టాన్ని ఎమ్మార్వో విజయశ్రీ మరియు విఆర్ఓ మరియు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు కే సాయిబాబు మరియు క్లస్టర్ ఇంచార్జ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ ప్రెసిడెంట్ ఈ. ఆంజనేయులు మరియు గ్రామ నాయకులు పరిశీలించారు. ఎమ్మార్వో మాట్లాడుతూ నష్టపడ్డ ప్రతి ఒక్కరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందిస్తామని చెప్పారు.

You cannot copy content of this page

Scroll to Top