రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ గడువు ముగిసినట్లా? ఉన్నట్లా?

TEJA NEWS

రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ గడువు ముగిసినట్లా? ఉన్నట్లా?

హైదరాబాద్:
వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ,వర్గాలకు చెందిన నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తుంది, రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థిక చేయూత ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిం చింది,

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించేందుకు తీసుకువచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకం ఆన్లైన్ దరఖాస్తుల గడువు నిన్నటితో ముగుస్తుండగా మరోసారి పొడిగిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

కానీ తీరా దరఖాస్తు చేసు కుందామని సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేయడంతో దరఖాస్తు గడువు 14వ తేదీతో ముగిసిందని, వెబ్సైట్ క్లోజ్ చేశామనే సమాచారంతో నిరుద్యో గుల్లో గందరగోళం ఏర్ప డింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన ఐదు లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయితే నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడంలోని పలుసమస్యలను గుర్తిం చిన ప్రభుత్వం తొలుత ఈనెల 14 వరకు గడువు పొడిగించినప్పటికీ చివరి మూడు రోజుల నుండి సర్వర్ ప్రాబ్లంతో అనేక మంది నిరుద్యోగులు దరఖాస్తూ చేసుకోలేక పోయారు.

దీంతో మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని సోషల్ మీడియాలో ప్రచా రం జరగడంతో నిరుద్యో గులు సంతోషించారు.

కానీ దరఖాస్తు చేసుకోవ డానికి మీ సేవకి వెళ్లి ప్రయత్నించగా సంబంధిత వెబ్సైట్ లో మాత్రం దరఖా స్తు గడువు ముగిసిందని ఉండడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతు న్నారు

You cannot copy content of this page

Scroll to Top