ఉప్పల్ నియోజకవర్గంలోని హాబ్సిగూడ డివిజన్ రజితా రెడ్డి

TEJA NEWS

ఉప్పల్ నియోజకవర్గంలోని హాబ్సిగూడ డివిజన్ రజితా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జరిగిన ముగ్గుల పోటీ బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి . ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..ముగ్గులు మన సంప్రదాయ కళలకు ప్రతీకలని, మహిళల సృజనాత్మకతను ప్రతిబింబించే గొప్ప వారసత్వమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సంస్కృతి పరిరక్షణకు తోడ్పడటంతో పాటు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి మా యొక్క ఫౌండేషన్ మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాగిడి లక్ష్మారెడ్డి ప్రథమ, ద్వితీయ తృతీయ బహుమతులుగా ప్రైజ్ మనీలు అందజేశారు..
మహిళలు కళా-సంస్కృతి రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top