కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్–15వ

TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్–15వ వార్డులో ఉన్న శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు నిర్వహించిన విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు ఘనంగా నిర్వహించారు.

అనంతరం హన్మంతన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతి సమృద్ధులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి మరియు ప్రాంతీయ ప్రజల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top