రామగుండం ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని మేయర్ మహంకాళి స్వామి ఆదేశం

TEJA NEWS

రామగుండం ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని మేయర్ మహంకాళి స్వామి ఆదేశం…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం
నగర మేయర్ మహంకాళి స్వామి ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందికి ఆదేశించారు. నిర్వహించిన సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, పరిశ్రమల కాలుష్యంతో పాటు ప్లాస్టిక్ కారణంగా స్థానికులు క్యాన్సర్ వంటి రోగాలతో బారినపడుతున్నారని గుర్తుచేశారు.

శానిటేషన్ డ్రైవ్ లో వెలువడుతున్న చెత్తలో ఎక్కువ శాతం ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఉన్నాయని, అందుకే ప్లాస్టిక్ పై యుద్ధం ప్రకటించి నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రతి వ్యాపార సంస్థ వద్ద నిషేధంపై బోర్డులు పెట్టాలని, ఉల్లంఘన yapanవారికి నిస్సంకోచంగా జరిమానాలు విధించాలని మేయర్ ఆదేశించారు.

ఫంక్షన్ హాళ్లలోనూ ప్లాస్టిక్ చెత్త వెలువడుతున్నందున నోటీసులు జారీ చేయాలని, రేపటి నుంచి జరిమానాలు వసూలు చేయడం ప్రారంభించాలని, నిషేధం అమలులో చురుగ్గా పని చేసినవారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారని ఆయన తెలిపారు.
సభలో నగర పాలక సంస్థ అధికారులు, సూపరింటెండెంట్, సానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు అధికారులు, జవాన్లు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top