జెపి కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలోని రైల్వే లైను పునరుద్ధరణ పనులలో భాగంగా స్థానిక ప్రజల ఇళ్లు కోల్పోకుండా చూడాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు కి వినతి పత్రం అందజేసిన పటాన్చెరు తాజా మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ …….
జెపి కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడలో గల పాత రైల్వే ట్రాక్ ను నూతనంగా పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అధికారులు సర్వే నిర్వహించి, రైల్వే ట్రాక్ కు ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించే అవకాశం ఉందని చెప్పడం జరిగింది.
ఈ విషయమై రైల్వే ట్రాక్ సమీపంలో నివాసం ఉంటున్న బండ్లగూడ ప్రజలు తమ ఇల్లు కోల్పోతామని భయభ్రాంతులకు గురవుతూ పటాన్చెరు తాజా మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కి సమస్యను వివరించగా. పరిస్థితిని సమీక్షించిన మెట్టు కుమార్ యాదవ్ గారు దాదాపు 100 మందితో కలిసి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ MP రఘునందన్ రావు కి సమస్యను వివరిస్తూ, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ అధికారులు రైల్వే లైన్ పునరుద్ధరణ పనులలో భాగంగా రైల్వే ట్రాక్ ఇరు వైపులా 50 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలను తొలగించే అవకాశం ఉందని తెలియజేశారు.
ఈ పరిణామం వల్ల సుమారు 46 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న స్థానిక ప్రజలు తమ సొంత ఇళ్లను కోల్పోతామేమోనని చాలా ఆందోళనకు గురవుతున్నారు. రైల్వే లైను సమీపంలో సుమారు 35 ఇళ్లు ఉండగా. వాటిలో సుమారు 20 ఇళ్లు రైల్వే లైన్ వేయకముందే నిర్మించబడ్డాయి, మిగిలిన 15 ఇళ్లు తరువాత నిర్మించబడ్డాయి. ఈ కుటుంబాలలో ఎక్కువ మంది దిన కూలీలుగా బ్రతికే పేదవారు, వారికి ఈ ఇళ్లే ఆధారంగా ఉన్నాయి, ఇల్లు కోల్పోతే గ్రేటర్ హైదరాబాద్ లో కోట్లు వెచ్చించి ఇల్లు కొనుక్కోలేని దీన పరిస్థితుల్లో వారు ఉన్నారు కాబట్టి ఈ పేద ప్రజలకు అన్యాయం జరగకుండా జోక్యం చేసుకొని తగిన సముచిత చర్యలు తీసుకోవాలని,
రైల్వే లైన్ సమీపంలో ఉన్న ఇళ్లను తొలగించే ముందు ప్రభావిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ స్థలం లేదా ఇళ్లు కల్పించి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించడం జరిగింది.
సమస్యను విన్న ఎంపీ రఘునందన్ వెంటనే స్పందించి సంబంధిత రైల్వే డిజిఎం కి ఫోన్ చేసి పరిస్థితిని కనుక్కోవడం జరిగింది. రైల్వే DGM కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బండ్లగూడ బిఆర్ఎస్ అధ్యక్షుడు భరత్ కుమార్ , నిజాంబాద్ శ్రీను , మాజీ వార్డ్ మెంబర్ లక్ష్మణ్ , శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
