శంకర్‌పల్లి పట్టణ పరిధిలో ప్రధాన రోడ్లకు మరమ్మతులు చేయండి: బిజెపి నాయకుల డిమాండ్

TEJA NEWS

శంకర్‌పల్లి పట్టణ పరిధిలో ప్రధాన రోడ్లకు మరమ్మతులు చేయండి: బిజెపి నాయకుల డిమాండ్

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డు, ఫతేపురం రోడ్లకు మరమ్మతులు చేయాలని స్థానిక బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి గుంతలు పడ్డ రోడ్లను పరిశీలించారు. మున్సిపల్ అధికారులు ప్రజల వద్ద పన్నులు వసూలు చేయడం పైన ఉన్న శ్రద్ధ, పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో మాత్రం శూన్యం అని ఆరోపించారు. వెంటనే రోడ్ల శాఖ, మున్సిపల్ అధికారులు గుంతలపడ్డ రోడ్లను బాగు చేయాలని, లేకపోతే ప్రజల తరఫున రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దేవ ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, బీజేవైఎం అధ్యక్షుడు లోకేష్, రామ్మోహన్ రెడ్డి, వీరేందర్, లోకేష్, బూత్ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి, మైనార్టీ నాయకుడు రుక్మద్దీన్, గణేష్ ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top