స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి

TEJA NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలి

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయాలి : గిద్దె రాజేష్

సూర్యపేట జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేలా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డిని ఆయన కోరారు. హైదరాబాద్ రవీంద్ర భారతి లో డాట్ రైజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డిని గిద్దె రాజేష్ కలిసి, రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు వికలాంగుల పింఛన్లను రూ.6,000కు పెంచాలని, వికలాంగులకు 100 శాతం రాయితీతో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఈ అంశాలపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్యలు తీసుకోవాలని కోరారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ శాసనసభలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాట్ రైజు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం, ప్రజా గాయకుడు నల్గొండ గద్దర్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మారవేణి చంద్రశేఖర్ యాదవ్, స్పెషల్ బీడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు వాంకుడు లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top