మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు

TEJA NEWS

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగినది.

ఈ సందర్భంగా ఆదిత్య నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ ఆదిత్య నగర్ కాలనీ లో మౌలిక వసతులు కలిపించినదుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అదేవిధంగా ఆదిత్య నగర్ కాలనీలో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల ను వేయాలని మరియు అసంపూర్తిగా మిగిలిపోయిన UGD పనులు చేపట్టాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చలని, విధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని PAC చైర్మన్ గాంధీ ని వినతి పత్రం ద్వారా కోరడం జరిగినది.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే కాలనీ లో పర్యటిస్తానని, ఆదిత్య నగర్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, UGD, పనులు అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని రోడ్ల ను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల పనులు వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగేలా చూడలని అధికారులకు తెలియచేసారు.

మంచి నీటి సరఫరా లో అంతరాయం లేకుండా మెరుగైన మంచినీటి సరఫరా చేయాలని, అవసరమున్న చోట మంచి నీటి సరఫరా సమయం పెంచాలని , తక్కువ ప్రెజర్ తో వచ్చే చోట తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ జలమండలి అధికారులకు తెలియచేసారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలియచేసారు . అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే గాంధీ
తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆదిత్య నగర్ కాలనీ ప్రెసిడెంట్ మహమ్మద్ ఖాసీం, వైస్ ప్రెసిడెంట్ లియాకత్, సెక్రెటరీ మొయిజ్, బాబు మియా, మహమ్మద్ అమీర్, మహమ్మద్ అష్రాఫ్, మహమ్మద్ ఫజల్, షేక్ అస్లాం మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top