సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య

TEJA NEWS

సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .

చేవెళ్ల నియోజకవర్గం:- నవాబ్ పేట్ మండలం ఎల్లకొండ గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు శంకర్ పల్లి మండలం మహాలింగాపురం (దోబి పేట్) గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాలలో పాల్గొన్న చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భూములకు సంబంధించిన సమస్యలను సత్వర పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టాన్ని తీసుకోరావడం జరిగిందన్నారు.

అనంతరం నవాబ్ పేట్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top