రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వీరవల్లి వంశీ ప్రమాణ స్వీకారం
శుభాకాంక్షలు తెలిపిన జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ
ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) డైరెక్టర్ గా వీరవల్లి వంశీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా, చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన సమన్వయకర్త తోట రాజ రమేష్, జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ మర్యాదపూర్వకంగా వీరవల్లి వంశీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో, చిలకలూరిపేట జన సైనికులు మరియు నాయకులు కూడా పాల్గొన్నారు. వీరంతా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వీరవల్లి వంశీకి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.
వీరవల్లి వంశీని ఏపీఆర్డీసీ డైరెక్టర్గా నియమించడం పట్ల జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
