ఉద్యమ కవి గాయకుడు జయరాజును సన్మానించిన సాహితీ కళావేదిక

TEJA NEWS

తెలంగాణ ఉద్యమ కవి గాయకుడు,రాష్ట్ర కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత జయరాజును సాహితీ కళా వేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు.ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వనపర్తికి వచ్చిన ఆయనను కళావేదిక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ జయరాజ్ సమాజాన్ని చైతన్య పరిచే ఎన్నో పాటలను రచించారని ఆయన నిరంతరం పేద బలహీన వర్గాల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తున్నారని పేర్కొన్నారు.

ఆయన సాహిత్య ఎంతోమంది వర్ధమాన కవులకు స్పూర్తిగా నిలిచిందని అన్నారు.ఈ సందర్భంగా జయరాజ్ తాను రచించిన పుస్తకాలను ఇక్కడి పలువురి సాహితీవేత్తలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళావేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్,డా.బండారు శ్రీనివాస్,డా.నరేష్ కుమార్,డా.శ్యాం సుందర్,ఉప్పరి తిరుమలేశ్,రచయితలు డా.వీరయ్య, పద్మావతి,డా.కంటే నిరంజనయ్య,మధుకర్,కిరణ్ కుమార్ ,దర్శన్ కుమార్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top