రేస్ బాలికల కాలేజీలో సంక్రాంతి సంబరాలు

TEJA NEWS

కోదాడ పట్టణం నయా నగర్ లో రేస్ బాలికల కాలేజీలో సంక్రాంతి సంబరాలు ముందస్తుగా ప్రారంభమైనవి! విద్యార్థినులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు.విద్యార్థినులు వేసిన రంగురంగుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బాణాల వసంత మాట్లాడుతూ పల్లె సంస్కృతి, సాంప్రదాయాలు నేటి తరం విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో కళాశాలలో సంక్రాంతి పండుగ వేడుకలు ముందస్తుగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పండగ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. విద్యార్థినులకు నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, సునీత, విద్యార్థినులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top