నేత్రదానంతో నలుగురికి చూపు.

TEJA NEWS

నేత్రదానంతో నలుగురికి చూపు.
నేత్రదానంతో వెలుగులు నింపుదాం…
స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానం.


కోదాడ :
కోదాడ పట్టణానికి చెందిన బండారు రాంబాయమ్మ మృతి చెందగా, ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాంబాయమ్మ నేత్రాలను దానం చేశారు. కుమారుడు హరిప్రసాద్, భర్త రంగారావు ఈ గొప్ప నిర్ణయం తీసుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. ట్రస్ట్ ప్రతినిధి ప్రవీణ్ రాజశేఖర్ మాట్లాడుతూ ఇది తమ ట్రస్ట్ ద్వారా జరిగిన 110వ నేత్రదానమని, వీటిని ఖమ్మం నేత్రనిధికి అందజేశామని తెలిపారు. పుట్టెడు దుఃఖంలోనూ సేవా దృక్పథాన్ని చాటిన కుటుంబాన్ని ఆర్యవైశ్య పెద్దలు, ట్రస్ట్ సభ్యులు ఘనంగా అభినందించారు. కంటి చూపు లేని వారికి చూపును అందించేందుకు అపోహలు వీడి నేత్రదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు ఓరుగంటి కిట్టు, యాదా సుధాకర్, పోలిశెట్టి బ్రాహ్మం, రవి కుమార్, గుడుగుంట్ల సాయి, వెంపటి ప్రసాద్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top