యువత తలుచుకుంటే దేశాన్ని మార్చవచ్చని వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించిన గొప్ప సంఘ సంస్కర్త స్వామి వివేకానంద: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
127 – రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీ నగర్ లో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (జీడిమెట్ల), ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్త సహకారంతో నిర్వహించిన స్వామి వివేకానంద 163 వ జయంతి కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 20వ రక్తదాన శిబిరంలో రక్తదాతలను ఎమ్మెల్యే అభినందించి సర్టిఫికెట్లను, మెమంటోలను అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ…..యువత తలుచుకుంటే దేశాన్ని మార్చవచ్చని వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించిన గొప్ప సంఘ సంస్కర్త స్వామి వివేకానంద అని, స్వామి వివేకానంద చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరూ నడిచి దేశ ఐక్యత , సమగ్రతకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు జల్దా లక్ష్మీనాథ్, సభ్యులు శ్రీనివాస్, తిమ్మయ్య, నవీన్, రాజిరెడ్డి, ఎల్లయ్య, సందీప్, ఆనంద్, రాజు, విజయ్, ఆంజనేయులు, కార్తీక్ గౌడ్, బాలు నేత, సతీష్ గట్టోజి, వరప్రసాద్, అల్లావుద్దీన్, సోను తదితరులు పాల్గొన్నారు.
