ఆత్మచింతన, శాంతి, సేవాభావం, నైతిక విలువలు పెంపొందించడంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ కృషి విశేషం : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం పరిధి బాలా నగర్ డివిజన్ సాయి నగర్ లో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మితమైన “విశ్వ శాంతి భవనం” ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ , బ్రహ్మ కుమారీస్ రూరల్ వింగ్ వైస్ చైర్మన్ డాక్టర్ బి.కె.రాజు భైజి తో కలిసి నూతన భవనాన్ని, ధ్యాన కేంద్రంను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..ఆధ్యాత్మిక చైతన్యం, మానవ విలువలు, శాంతి సందేశాన్ని సమాజానికి విస్తృతంగా చేరవేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ భవనం, ప్రజలకు మార్గదర్శకంగా నిలవనుందన్నారు. బ్రహ్మకుమారీస్ సంస్థ గత అనేక దశాబ్దాలుగా ఆత్మచింతన, శాంతి, సేవాభావం, నైతిక విలువలు పెంపొందించడంలో విశేష పాత్ర పోషిస్తూ, సమాజంలో శాంతి సౌహార్దాలను బలోపేతం చేస్తోంది. ఈ “విశ్వ శాంతి భవనం” ద్వారా యువతకు, మహిళలకు, సామాన్య ప్రజలకు ఆధ్యాత్మిక అవగాహన, ధ్యానం, నైతిక జీవన విధానం పట్ల ప్రేరణ లభించనుంది. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి తోడ్పడిన బ్రహ్మకుమారీస్ నిర్వాహకులకు, సేవాదారులకు, భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, బ్రహ్మ కుమారీస్ ఇంచార్జి బి.కె.సరోజినీ, బి.కె.జ్యోతి, బి.కె.మంజు, బి.కె.మాధవి, బి.కె.సత్యనారాయణ, బి.కె.సుధాకర్, బి.కె.నాందేవ్, నాయకులు వెంకటేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
