కుత్బుల్లాపూర్ నియోజకవర్గం భూదేవి హిల్స్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి. సత్యనారాయణ రావు వివాహ వార్షికోత్సవం సందర్భంగా, బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి ని శాల్వాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ కావలి చెన్నయ్య, జూపల్లి వెంకటేష్, అనిల్, అభిలాష్, శేఖర్ గౌడ్, ఈశ్వర్, అజిత్ తదితరులు పాల్గొన్నారు
