
శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ మరియు డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆదేశాలమేరకు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఖాజా నగర్ ఈద్గా లో మరియు ఎల్లమ్మబండ రైతు బజార్ వద్ద ఉన్న మసీద్ లలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా స్థలాన్ని జిఎచ్ఎంసి సిబ్బందితో శుభ్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరు ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని అన్నారు. డివిజన్ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేసారు. కార్యక్రమంలో మల్లేష్, కైసర్, షౌకత్ అలీ మున్నా, సమ్మద్, ఖలీమ్, గౌస్, రసూల్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.