మోడల్ గా నిలిచేలా సెట్విన్ కేంద్రం కార్యకలాపాలు

TEJA NEWS

మోడల్ గా నిలిచేలా సెట్విన్ కేంద్రం కార్యకలాపాలు
సికింద్రాబాద్ : సితాఫలమండీలోని సెట్విన్ శిక్షణా కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్రంలోనే ఓ మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, మరో రెండు అంతస్తుల్లో భవన సముదాయాన్ని నిర్మించి కొత్త ట్రేడ్ లలో శిక్షణను కల్పిస్తామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. గురువారం ఆయన సెట్విన్ శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్ధులు, సిబ్బందితో ముచ్చటించారు. బ్యుటిషియన్, కంప్యూటర్, ఫాషన్ డిజైనింగ్, హోటల్ మానేజ్ మెంట్, మొబైల్ రేపైరింగ్, సీ.సీ. కెమెరా రేపైరింగ్ విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్ళ క్రితం సితాఫలమండీ లో నెలకొల్పిన సెట్విన్ శిక్షణా కేంద్రం తన ప్రత్యేకతను చాటుకుంటుందని తెలిపారు. త్వరలో దీని కార్యకలాపాలు విస్తరిస్తామని తెలిపారు. విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఇంచార్జ్ అనిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top