శంకర్‌పల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేదలకి మాత్రమే: జనసేన నాయకుడు సాయికుమార్ గౌడ్

TEJA NEWS

శంకర్‌పల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిరుపేదలకి మాత్రమే: జనసేన నాయకుడు సాయికుమార్ గౌడ్

శంకర్‌పల్లి: జనసేన పార్టీ తరపున సాయికుమార్ గౌడ్, పార్టీ కార్యకర్తలు వేసిన డబుల్ బెడ్రూమ్ కేటాయింపు పై ఆర్ టిఐ వేసిన విషయం తెలుసుకున్న శంకర్‌పల్లి మున్సిపాలిటీలోని దాదాపు 15 మంది స్వంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల వారు, జనసేన పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో సాయికుమార్ గౌడ్ ని కలిసి తమ గోడుని చెప్పుకుంటూ బోరున విలపించారు.

ఆ కుటుంబాల వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చే నిరుపేద ఓటరు, అదే గెలిచిన రాజకీయ నాయకుడికి ఎందుకు గుర్తుండటం లేదని, మేము చనిపోతే మమ్మల్ని కిరాయి ఇంటి వారు కూడా అనుమతించని దౌర్భాగ్యంలో బతుకుతున్నామని విలపించారు. ఆ కుటుంబాలకి న్యాయం జరిగే వరకు, అనర్హులకి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ కేటాయింపుపై పూర్తి పోరాటం చేస్తామని, అర్హులైన వారికి అండగా జనసేన పార్టీ ఉంటుందని, ఆ పోరాటం ఎంత వరకైనా సాగిస్తామని సాయికుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. త్వరలోనే తమ పూర్తి కార్యచరణ సామాన్య ప్రజలకి చేరువయ్యేలా ప్రకటిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు దివాకర్, తెలుగు సాయి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top